Trisha Krishnan: త్రిష పొలిటికల్ స్టెప్.. ఏకంగా సీఎం సీటుపై ఫోకస్..

తమిళనాట రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సీనియర్ హీరోయిన్ త్రిష సిద్ధమవుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల త్రిష చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు బలాన్నిచ్చాయి. “తమిళనాడు సీఎం పదవిని అధిరోహించడం నా ఆఖరి లక్ష్యం” అంటూ ఆమె వెల్లడించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సినీ కెరీర్‌లోనే త్రిష దృష్టి సారించిందని తెలిసిన అభిమానులు ఆమె వ్యాఖ్యలకు ఆశ్చర్యపోతున్నారు.

సినీ పరిశ్రమ నుంచి రాజకీయ రంగానికి మారిన దిగ్గజాల రికార్డు తమిళనాడులో ప్రత్యేకమైనది. ఎంజీఆర్, జయలలిత వంటి ప్రముఖులు ఈ మార్గంలో ప్రజాధారణ పొందారు. ఇకపోతే, త్రిష వ్యాఖ్యలు తాజాగా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న విజయ్‌కు ప్రత్యక్ష పోటీగా ఉందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆమె ముఖ్యమంత్రి లక్ష్యాన్ని ప్రకటించడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేకించి, ఆమె అభిమాన వర్గాలు ఈ ప్రకటనను రాజకీయాల్లోకి తొలి అడుగు అన్నట్టుగా స్వీకరిస్తున్నారు.

త్రిష గతంలో ఎటువంటి రాజకీయ ఆలోచనలు వ్యక్తం చేయలేదు, ప్రస్తుతం 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను నమోదు చేయడం ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అయితే, వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ఆరంగేట్రానికి సంకేతమా? అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ వ్యాఖ్యలతో త్రిష తన భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా తెలియజేస్తుందా లేక వీటితో తన అభిమానుల నుంచి స్పందన తెలుసుకోవాలనుకుంటుందా అన్నదానిపై తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లయితే, తమిళనాడులో మరో ఆసక్తికరమైన రాజకీయ పోటీని చూడాల్సి ఉంటుంది.

Ap Public Fire On Chandrababu Over Arogya Sri || Ap Public Talk || Pawan Kalyan || Ys Jagan || TR