Vishal: తమిళ తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశాల్ తెలుగు తో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళంలో చాలా సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాలలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చివరగా మార్క్ ఆంటోనీ అనే సినిమాతో హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. తర్వాత రత్నం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. విశాల్ హీరోగా నటించిన మదగజరాజా సినిమా 2013 నుంచి వాయిదా పడుతూ ఇప్పుడు 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
అయితే ఎప్పుడూ ఫిట్ గా ఉండే విశాల్ తాజాగా ఒక ఈవెంట్లో బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడాడు. నిన్న విశాల్ ఒక ఈవెంట్లో పాల్గొనగా మాట్లాడుతుంటే అతని చెయ్యి వణుకుతూనే ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇలా బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయ్యో హీరో విశాల్ కి ఏమైంది ఎందుకు ఇలా మారిపోయాడు. సడన్గా ఇలా మారిపోవడానికి కారణం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Get well soon Vishal! 🙏 pic.twitter.com/HBFka4r0Pl
— LetsCinema (@letscinema) January 5, 2025
కాగా గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో విశాల్ కి ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలోనే కంటికి కూడా పెద్ద దెబ్బ తగిలింది. అప్పట్లో విశాల్ కి నరాల సమస్య కూడా వచ్చిందని, ఇప్పుడు మళ్ళీ అది తిరగబడింది పలువురు అంటున్నారు. దీంతో విశాల్ కి ఏమైంది అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో విశాల్ టీమ్ స్పందించి విశాల్ డాక్టర్ తో అధికారిక ప్రకటన ఇప్పించారు. డాక్టర్ రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం.. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అతను ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే అతనికి పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలి ఈ సమయంలో అని తెలిపారు. దీంతో విశాల్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్లు కోరుకుంటున్నారు. కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ కేవలం వైరల్ ఫీవర్ కి అంతలా తయారవుతారా అంత దారుణంగా మారిపోతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.