Game Changer: గేమ్ ఛేంజర్.. సంక్రాంతి నెంబర్ వన్ రికార్డును బ్రేక్ చేసేనా?

సంక్రాంతి టాలీవుడ్‌కు ఎప్పుడూ కూడా మంచి సీజన్. ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈ పండగకు బరిలో దిగుతున్న అతి పెద్ద సినిమా. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తుండటం సినీ ప్రియుల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ట్రైలర్‌లో చరణ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సులు, శంకర్ మార్క్ విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. చరణ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇది అభిమానులకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక కియారా అద్వానీ, అంజలి వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటించగా, తమన్ సంగీతం సినిమాకు మరో బలంగా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం తొలి రోజు రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

సంక్రాంతిలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో మహేష్ సినిమా ఉంది. 2020లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో తొలి రోజు సాధించిన రూ.45.7 కోట్ల రికార్డును గేమ్ ఛేంజర్ బద్ధలు కొట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే సామర్థ్యం గలదని చెబుతున్నారు.

ఈ చిత్రం చరణ్ కెరీర్‌లోనే టాలీవుడ్‌లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శంకర్ గత చిత్రం ఇండియన్ 2 నిరాశపర్చిన నేపథ్యంలో, ఈ చిత్రం అతడి ఫామ్ తిరిగి తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

అల్లుఅర్జున్ పై చిరంజీవి ఫైర్ | Chiranjeevi FIRES BACK at Allu Arjun || Pawan Kalyan | Telugu Rajyam