Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ మరొక మూడు రోజుల్లో విడుదల కానుంది. దీంతో అభిమానులు మూవీ మేకర్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. జనవరి 10వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్లు అన్నీ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరుకావడంతో సినిమాపై ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు అంతా పాజిటివ్ గానే జరుగుతుంది.
కానీ రిలీజ్ సమయానికి గేమ్ ఛేంజర్ కి ఇబ్బందులు మొదలయ్యాయి. కర్ణాటకలో ఎప్పుడూ ఉండే కన్నడ భాష గొడవ జరుగుతోంది. తాజాగా సినిమా టైటిల్ కన్నడ లో లేదని, కన్నడలో పోస్టర్స్ రిలీజ్ చేయలేదని కర్ణాటకలో అతికించిన గేమ్ ఛేంజర్ పోస్టర్స్ పై బ్లాక్ పెయింట్ వేస్తున్నారు కన్నడ భాషాభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమాపై విమర్శలు చేస్తూ, ఈ సినిమాని బహిష్కరించాలని హడావిడి చేస్తున్నారు. మరి రిలీజ్ సమయానికి ఈ గొడవ చల్లారుతుందా లేదా చూడాలి మరి. ఇటీవలే కన్నడ హీరో సుదీప్ తన మ్యాక్స్ సినిమా టైటిల్ కన్నడలో లేదు ఎందుకు అని అంటే ఇలాంటి వాళ్ల అందరికి కలిపి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాపై ఇలా నెగిటివిటి చూపిస్తున్నారు.
#GameChanger‘ Faces Protests Ahead of Release
In #Karnataka, individuals expressed their discontent by spraying color on movie posters, alleging a lack of local updates about the film.#RamCharan #GlobalStarRamCharan #Shankar #KiaraAdvani #Tupaki pic.twitter.com/7Y2WAu8HIa
— Tupaki (@tupaki_official) January 3, 2025
ఇక తమిళనాడులో స్టార్ హీరో అజిత్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ కి అక్కడ బాగా కలిసొస్తుందని అంచనా వేశారు. అసలే తమిళనాడులో ఈ సినిమాని 32 కోట్లకు కొన్నట్టు సమాచారం. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ఆపాలని లైకా నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. లైకా నిర్మాణ సంస్థలో శంకర్ ఇటీవల ఇండియన్ 2 చేసాడు. ఇండియన్ 3 సినిమా కూడా ఉంది. గతంలోనే ఇండియన్ 2 సినిమా పూర్తయ్యేవరకు శంకర్ ఏ సినిమా చెయ్యకూడదు అని లైకా ఇబ్బందులు పెట్టడంతో గేమ్ ఛేంజర్ ని మధ్యలోనే వదిలేసి ఇండియన్ 2 పూర్తిచేసి మళ్ళీ గేమ్ ఛేంజర్ కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ లైకా శంకర్ ఇండియన్ 3 పూర్తిచేసే దాకా గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయొద్దు అని తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించడం చర్చగా మారింది. ఇలా తమిళనాడు కర్ణాటకలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు ఎదురవుతుండడంతో గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ కాస్త ఆందోళన పడుతున్నారు. మరి ఈ వివాదాలన్ని తట్టుకొని ఈ సినిమా థియేటర్లో విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.