Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప 2. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల రికార్డులు సృష్టించిన పుష్ప సినిమా తాజాగా మరో అరుదైన రికార్డులను సృష్టించింది. కాగా సినిమా విడుదలైన 32 రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల రూపాయాలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన బాహుబలి 2 వసూళ్లను క్రాస్ చేసి పుష్ప 2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టడంతో అల్లు అర్జున్ అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ముందు నుంచి అనుకున్న విధంగానే ఈ సినిమా బాహుబలి త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా రికార్డులను బద్దలు కొట్టి మరీ సరికొత్త రికార్డు సృష్టించింది.
అల్లు అర్జున్ అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ రష్మిక మందన కలిసి నటించిన పుష్పటు, 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అయ్యి తక్కువ సమయంలోనే ఎక్కువ కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. అలా మొదలైన ఈ సినిమా రికార్డులు తాజాగా బాహుబలి సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టే వరకు వెళ్ళింది. ఇంకా ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.