Nayanthara: ఇటీవల ఒక డాక్యుమెంటరీ విషయంలో నయనతార హీరో ధనుష్ ల మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో సంచలనంగా మారింది. నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించగా అందులో ధనుష్ నిర్మాణంలో నయనతార నటించిన నేను రౌడీనే సినిమా కంటెంట్ ని ధనుష్ పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు ధనుష్ నయన్ కు పది కోట్లు కట్టాలంటూ లీగల్ నోటీసులు పంపించాడు. అయితే ఇదే డాక్యుమెంటరీ విషయంలో ఇప్పుడు నయనతారకు మరో నిర్మాతలు నోటీసులు పంపించారు.
ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన కంటెంట్ తమ పర్మిషన్ లేకుండానే వాడుకుందని నిర్మాతలు ప్రభు, గణేశన్ నయనతారకు 5 కోట్లు కట్టాలంటూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఇప్పటివరకు అయితే నయనతార ఇంకా దీనిపై స్పందించలేదు. గతంలో ధనుష్ లీగల్ నోటిస్ పంపిస్తే నయనతార సీరియస్ అయి పర్మిషన్ కోసం నీ వెనక తిరిగితే నువ్వు సమాధానం ఇవ్వలేదు. మాకు ఆ సినిమా స్పెషల్ కాబట్టి వాడుకున్నాము అంటూనే నువ్వు అందర్నీ ఇబ్బంది పెడతావు, ఆ సినిమా సమయంలో మమల్ని కూడా యిబ్బంది పెట్టావు, అందరూ నిన్ను మంచివాళ్ళు అనుకుంటారు కానీ నీ అసలు రూపం ఎవ్వరికి తెలీదు.
మూడు సెకండ్స్ కే ఇలా నోటీసులు పంపిస్తావా అంటూ ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పబ్లిక్ గానే పోస్ట్ పెట్టింది. ఈ వివాదంపై ధనుష్ సైతం స్పందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ – నయనతార కేసు కోర్టులో ఇంకా నడుస్తుంది. ఇలాంటి సమయంలో చంద్రముఖి నిర్మాతలు కూడా నయనతారకు ఇదే విషయంలో నోటీసులు పంపించడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై నాయనతార ఏవిధంగా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.