Tollywood: తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నెట్టింట ఫొటోస్ వైరల్!

Tollywood: హీరోయిన్ హరిప్రియ.. చాలామంది హరిప్రియ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమాలో హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ సినిమాలో అచ్చ తెలుగు ఆడపిల్లల నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ఈ సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది హీరోయిన్ హరిప్రియ. పేరుకే కన్నడ బ్యూటీ అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా బాగానే అభిమానులను సంపాదించుకుంది. పిల్ల జమీందార్ సినిమాలో హరి ప్రియ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. తకిత తకిట సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ ఈ ముద్దుగుమ్మ.

రెండో సినిమా పిల్ల జమీందార్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశౄలు వచ్చాయి. వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత తెలుగు వెండి తెరపై కనిపించలేదు. కన్నడ సినిమాలో మాత్రం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. బెల్ బోటమ్, కురక్షేత్ర, పెట్రోమాక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కన్నడ ప్రేక్షకులకు బాగా చేరువ అయింది. ఇకపోతే ఈమె సినిమాల సంగతి పక్కన పెడితే.. హరిప్రియ 2023లో వశిష్ట అనే వ్యక్తితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఆమె భర్త కూడా ప్రముఖ నటుడే. కేజీఎఫ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో కనిపించిన వశిష్ట నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్ తదితర తెలుగు సినిమాల్లో నూ యాక్ట్ చేశాడు. చివరిగా చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో వచ్చిన ఏవమ్ సినిమాలోనూ విలన్ గా నటించాడు. ఇకపోతే హరిప్రియ ఇప్పుడు 9 నెలల గర్భవతి. అంటే త్వరలోనే ఆమె ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా ok ప్రైవేట్ రిసార్ట్‌లో హరిప్రియ సీమంతం వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.