Honey Rose: హనీరోజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో నటించినది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ భారీగా క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ ఒక్క సినిమాతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ముఖ్యంగా తన అందంతో యువతను పిచ్చెక్కించింది. అమ్మడి అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు ఈ బ్యూటీ. ఇదిలా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే హనీరోజ్ తాజాగా తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హనీరోజ్ ఫిర్యాదు పై పోలీసులు 27 మంది పై కేసు నమోదు చేశారు. ఫేస్బుక్ పోస్ట్ పై అసభ్యకరమైన కామెంట్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొంది హనీ రోజ్. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తనను అవమానిస్తున్నాడంటూ హనీ ఒక పోస్ట్ ను షేర్ చేసింది. తనఫై బ్యాడ్ కామెంట్స్ రావడంతో హనీ రోజ్ పోలీసులను ఆశ్రయించింది. హనీ రోజ్ స్క్రీన్‌షాట్ లతో సహా కొచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరదా విమర్శలు, నా లుక్స్ పై వేసే సరదా జోక్స్, మీమ్స్ ను నేనూ ఎంజాయ్ చేస్తాను.. వాటిని నేను యాక్సప్ట్ చేస్తా వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ, వాటికీ కూడా ఒక హద్దు ఉంటుంది. అసభ్యకరంగా చేసే కామెంట్స్ ను ఏమాత్రం సహించను. అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకోసం మాత్రమే కాదు మహిళలందరి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నా అని హనీ రోజ్ పేర్కొంది.
ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ అవమానిస్తున్నాడు. నేను ఆ కామెంట్స్ చూసి పట్టించుకోకపోతే. నా ఫ్రెండ్స్ నువ్వు ఇలాంటివి స్వాగతిస్తున్నావా? అని అడుగుతున్నారు. అతను ఒక బిజినస్ మ్యాన్. నన్ను ఒకేసారి ఎదో ఈవెంట్ కు పిలిచాడు. కానీ నేను వెళ్లడం కుదరలేదు. దాంతో అతను ఉద్దేశపూర్వకంగా నేను వెళ్ళే ఫంక్షన్లలో నా ఫోటోలపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు. వీలైన చోట మీడియాలో నా పేరును అవమానపరిచే విధంగా ప్రస్తావిస్తాడు. దాంతో నేను పోలీసులను ఆశ్రయించాను అని తెలిపింది హనీ రోజ్. దీంతో చాలామంది హని రోజుకి మద్దతుగా నిలుస్తున్నారు. మంచి పని చేశారు ఇంకొకసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి అంటే వణుకు పుట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.