Hathya: శ్రీ విద్యా బసవ తెరకెక్కిస్తున్న ‘హత్య’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్యా బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో రానున్నారు. ఈ సినిమాను మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవి వర్మ కనిపిస్తున్న తీరు.. రక్తంతో కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ థ్రిల్లర్ మూవీ రాబోతోన్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రానికి అభిరాజ్ రాజేంద్రన్ నాయర్ సినిమాటోగ్రఫర్‌గా, నరేష్ కుమారన్ పి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఈ చిత్రానికి ఎడిటర్‌గా, ఎస్‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇవ్వనున్నట్టుగా టీం ప్రకటించింది.

నటీనటులు : ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

రచన & దర్శకత్వం: శ్రీ విద్యా బసవా

నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్

సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్ పి

ఎడిటర్: అనిల్ కుమార్ పి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి

సౌండ్ డిజైన్: సింక్ సినిమా- సచిన్ సుధాకరన్, హరిహరన్

సౌండ్ మిక్స్: అరవింద్ మీనన్

రేవంత్ ని ఆడిస్తుంది చంద్రబాబే || Director Geetha Krishna About Chandrababu & Revanth Reddy || TR