Rajamouli : ఆ మాటలు రాజమౌళికి బాగా తగిలాయా…. మహేష్ సినిమాలో అలా జరగదట….!

Rajamouli : రాజమౌళి సినిమా అనగానే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ సినిమా మొదలయ్యాక మాత్రం ఎపుడు సినిమా వస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఒక ప్రాజెక్ట్ టీ మొదలైతే కనీసం మూడేళ్లు సినిమాకు కేటాయిస్తాడు. అది కాకా రాజమౌళి తో పనిచేసే హీరోలు వేరే సినిమాల్లో పని చేయడానికి ఉండదు. కాబట్టి దాదాపు మూడేళ్ళు వాళ్ళ సమయాన్ని రాజమౌళి కీ త్యాగం చేయాల్సిందే.

ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా దాదాపు నాలుగేళ్లు సినిమా పూర్తి చేయడానికి సమయం తీసుకున్నాడు జక్కన్న మధ్యలో కరోనా వల్ల కొంత జాప్యం జరిగింది. అయితే రాజమౌళి తన వర్క్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్లే ఇంత జాప్యం జరుగుతుంది సినిమా తీయడానికి. ఇక సర్వత్ర విమర్శలు రాజమౌళి ఈ ఒక్క విషయంలోనే ఎదురవుతున్నాయి. సినిమాను కాస్త తొందరగా తీయండి అంటూ ప్రేక్షకులు అడగడంతో రాజమౌళి కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

ఈసారి మహేష్ తో తీయబోతున్న సినిమాను ఏడాదిలో ముగించి విడుదల చేస్తానని చెబుతున్నారు. ప్రీ వర్క్ కు ఎక్కువ సమయం తీసుకుని షూటింగ్ టైంను తగ్గించి సినిమాను 2023 ప్రారంభంలో మొదలుపెట్టారు పెట్టి డిసెంబర్ కు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట జక్కన. ఇక మహేష్ తో సినిమాను ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ కథగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో రాజమౌళి తండ్రి గారు రాజమౌళి బిజీగా ఉన్నారు.