Allu Arjun: నీ యాంకరింగ్ రప్పా.. రప్పా బన్నీ ప్రశంసలు… గాల్లో తేలిపోతున్న యాంకర్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ వేదికపై మాట్లాడుతూ ఎన్నో విషయాలు గురించి తెలిపారు చివరిగా ఈ కార్యక్రమం నుంచి వెళ్తూ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు. తెలుగువాళ్లు అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ తెలుగువారిని ఉద్దేశించి ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు అనంతరం ఈ కార్యక్రమానికి యాక్టర్ గా వ్యవహరించిన శ్రీముఖి గురించి కూడా ఈయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగమైనందుకు శ్రీముఖి అల్లు అర్జున్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నేపథ్యంలో .. అల్లు అర్జున్ మాట్లాడుతూ నీ యాంకరింగ్ రప్పా.. రప్పా అంటూ శ్రీముఖిపై ప్రశంసలు కురిపించారు. దీంతో శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ నోటి వెంట మరోసారి రప్పా.. రప్పా డైలాగ్ రావడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో రప్పా.. రప్పా అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో డైలాగ్ అయినప్పటికీ ఇటీవల గద్దర్ ఫిలింఫేర్ అవార్డులలో సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగానే అల్లు అర్జున్ ఈ డైలాగ్ చెప్పి అందరిని సందడి చేశారు అదేవిధంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈ డైలాగు ఎంతో ఫేమస్ అయ్యింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట పుష్ప డైలాగ్ రావడంతో ఇది కాస్త జాతీయ స్థాయి మీడియాలో మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం అట్లి డైరెక్షన్లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.