Bigg Boss Agnipariksha: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు బిగ్ బాస్ అగ్నిపరీక్ష. ఇందుకు సంబంధించిన ప్రోమోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్లు వెళ్లి నుండగా ఇప్పటికే అందులో ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. మిగిలిన 9 స్థానాల కోసం 16 మంది పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరికి డేర్ ఆర్ డై అంటూ రకరకాల టాస్క్ లు ఇచ్చారు. గెలిచిన వారిని టాప్ 15కి పంపించారు. కాగా ఎపిసోడ్ ప్రారంభంలో మొదటగా మాస్క్ మ్యాన్ హరీశ్, సాయికృష్ణ ను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్ విసిరారు. సీజన్ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు. మాస్క్ మ్యాన్ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్ అందుకుని అరగుండు గీసుకున్నారు.
దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్ 15కి పంపించారు. నెక్స్ట్ దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి ఐయామ్ లూజర్ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు. ఊర్మిళ మోడల్ కాబట్టి తాను రిజెక్ట్ చేసింది. శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. అయితే ఐయామ్ లూజర్ కు బదులుగా ఐ లవ్ బిగ్‌బాస్ అని పచ్చబొట్టు వేయించారు. తర్వాత సోల్జర్ పవన్ కల్యాణ్, అబూకు 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ, బర్గర్ ముందు పెట్టారు. ఈ గేమ్ లో పవన్ గెలిచాడు. ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్ లో ప్రియ రెండు చేతులు ఉపయోగించి దాలియాను ఓడించింది. కానీ, జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్ కు పంపించారు.

షాకీబ్, కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్ ఇచ్చింది. ముందుగా షాకీబ్‌ను బయటకు పంపేసి.. ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అర్జంట్‌గా డబ్బులు వేయించుకోవాలి. ఎవరి అకౌంట్ లో ఎక్కువ అమౌంట్ పడుతుందో వారు నెక్స్ట్ లెవల్ కు వెళ్తారు. దీంతో కల్కి తన ఫ్రెండ్ కు రెండుసార్లు ఫోన్ చేయగా రూ.90 వేలు అకౌంట్ లో పడ్డాయి. తర్వాత షాకీబ్ ను స్టేజీ పైకి పిలిచారు. కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్ చెప్పలేదు. ఎవరికైనా కాల్ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్‌లో వేయించుకో అంది శ్రీముఖి. కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని రూ.10 వేలు అడిగాడు. అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అతడి అకౌంట్ లో రూ.50 వేలు పడ్డాయి. తరువాత ఎవరి దగ్గర ఎక్కువుంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్ కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఈ గేమ్ లో కల్కి గెలిచింది. తనకు క్లియర్ గా టాస్క్ వివరించి చెప్పలేదని షాకీబ్ ప్రశ్న లేవనెత్తాడు.
దీంతో శ్రీముఖి ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా? అని అడగ్గా.. దమ్ము శ్రీజ చేయెత్తింది. తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు. కానీ నవదీప్ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు. ఎందుకు అన్‌ఫెయిర్ గా అనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీజ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించద్దు. బిగ్‌బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ చూసినప్పుడు శ్రీముఖి అలాగే నవదీప్ ఇద్దరు కాస్త ఓవరాక్షన్ చేయడం మాత్రమే కాకుండా శ్రీజాని చాలా తక్కువ చేసి చులకనగా అవమానించినట్లు మాట్లాడారు.
