బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్ని రకాల వార్తలు వచ్చాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ మూడో సీజన్‌లో పునర్నవి రాహుల్ మధ్య ఉన్న బంధాన్ని అందరూ ప్రేమబంధమనే అనుకున్నారు. వారు కూడా అలానే ప్రవర్తించేవారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత వరకు దాగుడుమూతలు ఆడినట్టు ఆడారు. కానీ బయటకు వచ్చాక అంత సీన్ లేదని చెప్పేశారు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పునర్నవి కొన్ని విషయాలను చెప్పింది. అలాంటిదేమీ లేదని, తాము కేవలం స్నేహితులమేనని పేర్కొంది.
మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్ బయటకు రావడంతో ప్రతీ ఒక్కరూ పునర్నవి గురించే అడిగేవారు. ఎక్కడ కనబడినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా కూడా పునర్నవితో ఉన్న రిలేషన్ ఏంటని అడిగేవారు. సోషల్ మీడియాలోనూ అవే ప్రశ్నలు ఎదురవ్వడంతో రాహుల్ ఒకనాకొ సమయంలో చిరాకు పడ్డాడు. ఎవరి లైఫ్ వారికి ఉంటుంది.. అది కేవలం షో అని చెప్పేశాడు. అయితే పునర్నవి కూడా ఇలాంటి ఓ సమాధానాన్నే చెప్పేది.
లైవ్‌లోకి వచ్చిన ప్రతీసారి పెళ్లి ఎప్పుడు? రాహుల్‌తో ఉన్న రిలేషన్ ఏంటి? అంటూ ప్రశ్నలు ఎదురవ్వడంతో పునర్నవి అసహనం వ్యక్తంచేసేది. నా పెళ్లి గురించి మీకెందుకు అంటూ రివర్స్ ప్రశ్నలు వేసేది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ అందరికీ చెప్పే చేసుకుంటానని తెలిపింది. ఎట్టకేలకు ఆ ఘడియలు రానే వచ్చాయి. తాజాగా పునర్నవి ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ ఫైనల్లీ ఇట్ హ్యాపెనింగ్ అంటూ సంబరపడిపోయింది. అయితే కాబోయే వాడి వివరాలు మాత్రం వెల్లడించలేదు.