ప్రస్తుతం బిగ్ బాస్ సభ్యులందరూ ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బిగ్ బాస్ ఉత్సవం పేరుతో ఓ గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న సంగతి తెలిసిందే. ఇందులో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు ఒకే చోట చేరుకున్నారు. అయితే ఇందులో మొదటగా మూడు సీజన్ల సభ్యులు మాత్రమే కలిశారు. రెండు మూడు రోజులుగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన షూటింగ్‌లే జరిగాయి. ఇందులో మూడు సీజన్ల విన్నర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి రచ్చ చేశారు. అందులో రాహుల్ సిప్లిగంజ్ బాగానే హల్చల్ చేసినట్టున్నాడు.
మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ, రెండో సీజన్ విన్నర్ కౌశల్‌తో దిగిన ఫోటోలను రాహుల్ షేర్ చేస్తూ సందడి చేశాడు. అయితే బిగ్ బాస్ ఉత్సవానికి సంబంధించిన షూటింగ్ ముగిసినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న రాబోతోన్న ఈ ఈవెంట్ ప్రోమో కూడా బాగానే క్లిక్ అయింది. అయితే ఇప్పుడు రాహుల్ తన ఫ్రెండ్ అయిన అలీ రెజాతో కలిసి ముంబైకి చెక్కేశాడు. ముంబైకి వెళ్లడానికి గల కారణాలను అయితే రాహుల్ వెళ్లడించలేదు. కానీ రాహుల్ చేసిన కామెంట్ మాత్రం వైరల్ అవుతోంది.
మామూలుగానే రాహుల్‌కు సాయంకాలం సమావేశాలు అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజూ సాయంత్రం అలా ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వడం ఇష్టం. ఇందులో భాగంగా రాహుల్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. ఇందులో అలీ రెజా కూడా ఉన్నాడు. సాయంకాలపు సమావేశాలు అని చెబుతూ అందులో మా వేశాలు అనే పరోక్షంగా అసలు విషయం చెప్పాడు. ఇక ముంబైకి ఈ ఇద్దరు ఎందుకు వెళ్లారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తన ఊకో కాక స్టోర్ పని మీద వెళ్లారా? లేదా ఏదైనా సినిమా షూటింగ్ కోసం వెళ్లారా? అన్నది తెలియాల్సి ఉంది.