‘కార్తీకదీపం’ షూటింగ్ గ్యాప్‌లో అలా.. వంటలక్కను ఆటాడిస్తోన్న శౌర్య

Premi Viswanath And Krithika Enjoys In Karthika Deepam Set

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌ది ఓ చెక్కు చెదరని రికార్డ్. గత రెండేళ్టుగా టాప్ రేటింగ్‌తో దూసుకుపోతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. తెలుగు సీరియల్స్‌లో ఇప్పటి వరకు కార్తీకదీపం టీఆర్పీని అందుకు ధారావాహిక లేనేలేదు. స్టార్ హీరోల సినిమాలు వేసినా సరే కార్తీకదీపం సీరియల్‌కే అత్యధిక టీఆర్పీ వస్తూ ఉంటుంది. దానికి కారణం వంటలక్క, దీప, కార్తీక్, డాక్టర్ బాబు, శౌర్య, హిమ అనే పాత్రలను అందరూ తమ మనసుల్లోకి తీసుకోవడం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇక రౌడీగా చిచ్చర పిడుగ్గా శౌర్య పాత్రలో బేబీ కృతిక నటన అందర్నీ కట్టిపడేస్తూ ఉంటుంది. తెరపైనే కాదు నిజ జీవితంలో కృతిక తన గొప్ప మనసును చాటుకుంటుంది. చిన్న వయసే కానీ సాయం చేయడంలో పెద్ద మనసు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల చేత కూడా మంచి పనులు చేయిస్తూ ఉంటుంది.

Premi Viswanath And Krithika Enjoys In Karthika Deepam Set
Premi Viswanath And Krithika Enjoys In Karthika Deepam Set

కృతికి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. తన సోషల్ మీడియా ఖాతాలో కార్తీక దీపం షూటింగ్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటుంది. షూటింగ్ గ్యాప్‌లో అందరూ కలిసి ఎలా ఎంజాయ్ చేస్తారో చూపిస్తూ ఉంటుంది. తాజాగా కృతిక ప్రేమి విశ్వనాథ్‌తో కలిసి ఓ ఆట ఆడింది. వంటలక్కతో కలిసి డ్యాన్సులు చేసింది. ఇద్దరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. షూటింగ్ గ్యాప్‌లో ఇలా ఎంజాయ్ చేశామని ఇంకా చాలా ఉన్నాయని కృతిక చెప్పుకొచ్చింది.