Shobha Shetty: తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సీరియల్ బుల్లితెరపై సంచలనం సృష్టించింది అని చెప్పాలి. తెలుగులో ఇప్పటి వరకు కొన్ని వందల సీరియల్స్ ప్రసారం అయినా కూడా ఇప్పటి వరకు ఏ సీరియల్ సాధించలేని అత్యధిక టీఆర్పీ రేటింగ్ నీ సాధించి నెంబర్ 1 సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీ ప్రేక్షకులు ఈ సీరియల్ కి, సీరియల్ లోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోయారు.
సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ సీజన్ 2 నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ తో నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబుగా, ప్రేమి విశ్వనాధ్ వంటలక్కగా పాపులర్ అయ్యారు. వీరిద్దరి తర్వాత ఈ సీరియల్ లో బాగా పాపులర్ అయిన క్యారెక్టర్ మోనిత. నెగిటివ్ క్యారెక్టర్ లో శోభా శెట్టి నటించి భారీగా ఫేమ్ నీ తెచ్చుకుంది. కార్తీక దీపం సీరియల్ లో శోభా శెట్టి వంటలక్కని ఇబ్బంది పెట్టె పాత్రలో, డాక్టర్ బాబు, వంటలక్కని దూరం చేయాలనే నెగిటివ్ పాత్రలో నటించింది. ఈ సీరియల్ తర్వాత టీవీ షోలు, బిగ్ బాస్ తో మరింత వైరల్ అయింది శోభా శెట్టి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభా కార్తీక దీపం ఎఫెక్ట్ బయట ఎలా ఉందో చెప్పింది. ఈ సందర్భంగా శోభా శెట్టి మాట్లాడుతూ.. ఒకసారి ఒక విలేజ్ కి వెళ్ళాను. అక్కడ ఒక ముసలావిడ వచ్చి నా చేతులు పట్టుకొని నువ్వు అలా చేయకు మోనిత, వంటలక్క, డాక్టర్ బాబుని కలుపు. వాళ్ళిద్దర్నీ కలిపేయ్ అని చెప్పింది. నేను అది సీరియల్ కలిపేస్తే అయిపోతుంది అని చెప్తే అదంతా నాకు తెలీదు, వాళ్ళను కలపండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని నా కాళ్ళ మీద పడబోయింది అని తెలిపింది. ఈ సందర్బంగా శోభా శెట్టి చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Shobha Shetty: డాక్టర్ బాబు,వంటలక్కని కలపమంటూ నా కాళ్ళు పట్టుకున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన శోభా!
