భీమన అమావాస్య సందర్భంగా భర్తకు పాద పూజ చేసిన ప్రణీత…!

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి ప్రణీత సుభాష్. తనీష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సిద్దార్థ్ హీరోగా నటించిన బావ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల ద్వారా ప్రణీత హీరోయిన్ గా అంతా పాపులర్ కాలేకపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఈ సినిమాలో ప్రణీత పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక పాటలో కూడా నటించింది. ఆ తర్వాత రభస, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత ప్రణీత టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవటంతో తెలుగులో సినిమాలు చేయలేదు.

ఇక కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ప్రణీత ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రణీత సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన భర్త పుట్టినరోజు సందర్భంగా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని కూడా బయటపెట్టింది. అప్పటి నుండి బేబీ బంప్ ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తాజాగా ప్రణీత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల ఆషాడ అమావాస్య సందర్భంగా ప్రణీత ఇంట్లో పూజ చేసింది. సినిమాలలో గ్లామర్ తో పద్దతిగ కనిపించే ప్రణీత సంప్రదాయాలను కూడా బాగ్ ఫాలో అవుతుంది. అషాడమాసం చివరి అమావాస్యను భీమన అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజున గృహిణులు తమ భర్తతో పాటు పెద్దలకు, గురువులకు పాద పూజా చేస్తారు. ఈ క్రమంలో ప్రణీత కూడా భీమన అమావాస్య రోజున ఇంట్లో తన భర్తకి పాద పూజ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.