ఆ బూతు పదం వాడి స్టార్ హీరో కి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్.. అసలేమైందంటే?

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే.ఇలా కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయినటువంటి ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ప్రస్తుతం ఈయనకు 42 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ ఈయన ఇంకా పెళ్లి గురించి ఆలోచించకపోవడం విశేషం.అయితే ప్రభాస్ కు సంబంధించిన ఏదైనా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే అది కేవలం తన పెళ్లి గురించి మాత్రమేనని చెప్పాలి.

ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా బాలీవుడ్ నటి కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇకపోతే ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు కూడా వీరిద్దరు త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వెల్లడించారు. ఇక బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సైతం ప్రభాస్ గుండెల్లో కృతి ఉందంటూ కామెంట్లు చేశారు.

ఇలా వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ పెళ్లి వార్తలపై స్పందించిన కృతి కేవలం సరదాగా మాత్రమే చెప్పారంటూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రభాస్ సదరు హీరో పై సీరియస్ అవ్వడమే కాకుండా ఎఫ్* అనే అతి పెద్ద బూతు పదాన్ని కూడా వాడి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ప్రభాస్ తన గురించి ఎలాంటి వార్తలు వచ్చిన పెద్దగా రియాక్ట్ కారనే విషయం అందరికీ తెలిసింది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.