నేటి నుంచి నాగచైతన్య.. వెంకట్ ప్రభు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!

టాలీవుడ్ యంగ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తాజాగా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ క్రమంలోనే తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా ప్రారంభించిన ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇళయరాజా తన కుమారుడు కలిసి సంయుక్తంగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య మరోసారి కృతి శెట్టితో జోడి కడుతున్నారు.ఈ క్రమంలోనే మంగళవారం అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. నేటి నుంచి ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలియజేశారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విడుదల కానుంది. ఇలా మొదటిసారి నాగచైతన్య ద్వి భాష చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే నాగచైతన్య కృతి శెట్టి జంటగా కళ్యాణ్ కే కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ జోడి వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.