చిన్న వయసు కానీ పెద్ద మనసు.. ‘కార్తీకదీపం’ శౌర్యకు సన్మానం!!

Karthika Deepam Fame Baby Krithika Gets Felicitated By Old Age Home

కార్తీక దీసం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రజలుండరంటే అతిశయోక్తి ఏ మాత్రం. కార్తీక దీపం సీరియల్‌ను మహిళాలోకం నెత్తిన పెట్టుకుంది. అందులోని వంటలక్క, దీప పాత్రల్లో ప్రేమీ విశ్వనాథ్.. డాక్టర్ బాబు, కార్తీక్‌ పాత్రలో నిరుపమ్ నటన అందరినీ కట్టిపడేస్తుంది. పిల్ల రౌడీగా, అల్లరి చేస్తూ, అందరినీ నిలదీసే చిచ్చర పిడుగ్గా శౌర్య (బేబీ కృతిక) చాలా ఫేమస్. అయితే ఈమె కేవలం బుల్లి తెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ ఫేమస్.

Karthika Deepam Fame Baby Krithika Gets Felicitated By Old Age Home
Karthika Deepam Fame Baby Krithika Gets Felicitated By Old Age Home

బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించుకుంది. కార్తీకదీపం సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా ద్వారా మంచి పనులు చేస్తూ ఉంటుంది. పది మందికి సాయం చేయాలని చెబుతూ ఉంటుంది. తనకు వీలైనంతలో సాయం చేస్తుంటానని చెబుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్య ఓ అభిమాని తన భార్యకు విషెస్ చెప్పమని శౌర్య (కృతిక)ను అడిగాడు.

Karthika Deepam Fame Baby Krithika Gets Felicitated By Old Age Home
Karthika Deepam Fame Baby Krithika Gets Felicitated By Old Age Home

ఎవరికైనా సాయం చేయండి.. అప్పుడు చెబుతాను అంటూ కండీషన్ పెట్టింది. దీంతో తనకు తోచినంతలో నిత్యావసర సరుకులు అందరికీ పంచిపెట్టాడు. అది చూసిన కృతిక సదరు అభిమాని చెప్పమన్న విషెస్‌ను వీడియో చేసి పంపించింది. అయితే కృతిక మామూలుగానే ప్రతీ నెలా ఓ వృద్దాశ్రమానికి విరాళం ఇస్తుందట. ఇంకా ఎవరికైనా సాయం కావాలంటే చేస్తుందట. తాజాగా కృతికను ఓ వృద్దాశ్రమంలోని సభ్యులంతా కలిసి సన్మానించారట. ఈ విషయాన్ని కృతిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో మురిసిపోయింది.