షాకింగ్ వీడియోకి స్పందించిన కాజల్..కానీ అసలు నిజం ఇదే.!

సౌత్ టాప్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది, అలాగే మరోపక్క అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా మారింది. కాగా ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు కూడా పలు సంచలన పోస్ట్ లు పెట్టిన తాను లేటెస్ట్ ఓ షాకింగ్ వీడియో చూసి అయితే రెస్పాండ్ అయ్యింది.

మన దేశంలోనే ఎక్కడో ఓ మహిళపై కొందరు మృగాళ్లు దారుణంగా హింసిస్తూ కర్రలతో కొడుతున్న వీడియో ఏ నెటిజన్ ప్రముఖుని ద్వారా వైరల్ కాగా దీనిపై కాజల్ స్పందిస్తూ ఇలాంటి మృగాళ్ళకి సరైన శిక్ష పడాలి కారణం ఏదైనప్పటికీ ఇలాంటి వారికి మాత్రం సరైన గుణపాఠం చెప్పి తీరాలి అని.

ఈరోజుల్లో మానవత్వానికి రోజులు లేకుండా పోయాయి అని మానవత్వం అంతకంతకూ అంతరించిపోతుంది అని తన బాధని అయితే వ్యక్తం చేసింది. అయితే అసలు ఈ వీడియో నిజం ఏమిటి అనేది ఆరా తీస్తే ఇది ఒక పాత రికార్డు కాగా దీనిని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా పొలిటికల్ పరంగా స్ప్రెడ్ చేస్తున్నారు.

అయితే అప్పట్లోనే ఈ వీడియోకి సంబంధించి అందులో ఉన్న నిందితులు అందరికీ అరెస్ట్ చేసి శిక్ష కూడా వేయడం జరిగింది అట. దీనితో ఈ వీడియో ప్రస్తుతానికి అవాస్తవం కాగా స్పందించిన కాజల్ ఎమోషన్ మాత్రం నిజం అని ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం పడుతున్నారు. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుండగా రీసెంట్ గా బాలయ్య 108 కి కూడా ఓకే చెప్పింది అని సమాచారం.