వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఊహించని విధంగా రాసలీలల వివాదాలలో చిక్కుకుంటున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే వైసీపీ నేతలతో మాట్లాడిన మహిళలు ఎవరనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. కావాలని ట్రాప్ చేసి ఒక పార్టీ నేతలు ఆడియోలను, వీడియోలను లీక్ చేయిస్తున్నారని కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గోరంట్ల మాధవ్ విషయంలో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే జగన్ మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ తో ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లినా వైసీపీనే మళ్లీ గెలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే వైసీపీ తరపున గోరంట్ల మాధవ్ ను పోటీ చేయిస్తే ఒక విధంగా తలనొప్పి అని మరో వ్యక్తిని పోటీ చేయిస్తే మరో విధంగా తలనొప్పి అని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
సైలెంట్ గా ఉంటే ప్రజలే మరిచిపోతారని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. సరైన సమయంలో ఈ విషయం గురించి స్పందించాలని జగన్ అనుకుంటున్నారని బోగట్టా. ప్రస్తుతానికి గోరంట్ల మాధవ్ పై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ ను సస్పెండ్ చేస్తే అధికార పార్టీకే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉందని ఆయన భావిస్తున్నారని సమాచారం.
మరోవైపు 2024 ఎన్నికలకు 20 నెలల సమయం మాత్రమే ఉండగా ఈ తరహా వివాదాల గురించి స్పందిస్తే పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని జగన్ భావిస్తున్నారని బోగట్టా. జగన్ ప్రస్తుతం 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని వైసీపీ నేతలకు సైతం జగన్ సూచించినట్లు బోగట్టా.
