బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి నిన్నటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. నిశ్చితార్థం జరిగినట్టు బిల్డప్ ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తూంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ యస్ చెప్పేశాను అంటూ ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసింది. ఉద్భవ్ రఘునందన్ అంటూ పెళ్లి ఫిక్స్ అయినట్టుగా ఓ ఫోటోను షేర్ చేసింది. మిగతా విషయాలన్నీ రేపు ప్రకటిస్తాను అని తెలిపింది.
మరో వైపు ఉద్భవ్ రఘునందన్ కూడా బాగానే పోస్ట్ చేశాడు. ఆమె యస్ చెప్పింది.. నాయిసీ.. రేపటి గురించి మీకు చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉందని షేర్ చేశాడు. ఉద్భవ్ రఘునందన్ ఫ్రొఫైల్ ప్రకారం అతనో రైటర్, యాక్టర్, ఫిల్మే మేకర్ అని తెలుస్తోంది. షార్ట్ ఫిలింలతో బాగానే ఫేమస్ అట. ఈ ఇద్దరూ యస్ చెప్పింది పెళ్లికి కాదట. ఓ వెబ్ సిరీస్ కోసం యస్ చెప్పారట. తాజాగా ఈ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
శ్రీముఖి ఉమెనియా ప్రోగ్రాంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలన్నీ ప్రకటించబోతోన్నట్టు తెలుస్తోంది. ఇలా తమ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పునర్నవి చేసే పోస్ట్‌లు ప్రమోషన్ కోసమే అయితే జనాలు ఛీ కొడతారు అంటూ నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమవుతోంది చూడాలి. పునర్నవి నిజంగానే పెళ్లి కోసం యస్ చెప్పిందా? లేదా.. వెబ్ సిరీస్ కోసం యస్ చెప్పిందా? అన్నది రేపు తెలుస్తుంది.