Balakrishna & Chiranjeevi : 90తరం వాళ్లకు ఇష్టమైన హీరోలంటే వినిపించే పేర్లు చిరు, బాలయ్య, వెంకీ , నాగార్జున. ఇక అప్పట్లో చిరు,బాలయ్య మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఇక అభిమానుల మధ్య కూడా బాగా పోటీ ఉండేది. సినిమాలో తమకు నచ్చిన హీరో గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. ఇపుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండటం వల్ల అంతగా తెలియక పోయిన అప్పట్లో ఇష్టమైన నటి నటుల గురించి తెలియాలంటే కేవలం వార పత్రికలు, పత్రికలపై ఆధారపడాల్సిందే.వార పత్రికలకు, సిని పత్రికలకు బాగా సర్క్యూలేషన్ ఉండేది.
ఒకప్పుడు సితార, జ్యోతిచిత్ర, శివరంజని పత్రికలు అప్పట్లో ఎంతగానో ప్రజాదరణ పొందాయి. కవర్ పేజీ మీద వేసిన హీరో హీరోయిన్ల లను బట్టి ఆ వార పత్రిక అమ్మకాల విషయంలో హెచ్చుతగ్గులు ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఎక్కువగా కవర్ పేజ్ మీద కనిపించేవారు. ఇక అప్పట్లో విజయబాపినీడు కేవలం చిరంజీవి కోసం ఒక వారపత్రికను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి పేరుతో అల్లు అరవింద్ ప్రచురణకర్తగా, విజయబాపినీడు సంపాదకత్వంలో ఈ పత్రిక తొలి సంచిక 1989 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. మిగతా సినిమా పత్రికల్లో రాని చిరంజీవిగారి విశేషాలు ఈ సినీ వార పత్రిక లో వచ్చేవి.
తమిళంలో కమల్ హాసన్, రజనీ కాంత్ లకు ఇలాగే పత్రికలు ఉండేవి.ఇక బాలయ్య బాబు కోసం. కూడా ఇలాంటి ఒక. ప్రత్యేక పత్రికను తేవాలని స్టెల్లింగ్ రామారావు అనే ఒక వ్యాపారవేత్త బాలకృష్ణ పేరుతో 1990 సంక్రాంతి నుంచి ఈ పత్రిక తీసుకురావాలని ప్రయత్నం చేశారు. రామారావు అతని టీం గోల్డ్ స్టార్ డమ్మీ పత్రిక తీసుకొని వెళ్లి బాలకృష్ణను కలిశారు. వాటిని చూసిన బాలకృష్ణ మళ్ళీ కలుద్దాం అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు.
బాలకృష్ణ పేరుతో పత్రిక వస్తుందని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇవ్వడంతో ఇలాంటి పత్రికలకు నేను వ్యతిరేకం అని, సినిమా పత్రికల్లో వచ్చే ప్రకటనలు తనకు చాలని, తన అభిమానులు ఇలాంటి పత్రిక తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే దాని గురించి ఆలోచించే వాడిని కానీ నా అనుమతి లేకుండా నా పేరు తో ఓ పత్రిక తీసుకురావాలి అని ప్రకటన చేయడం మంచి పద్ధతి కాదు అని బాలకృష్ణ గట్టిగా హెచ్చరించారు. అలా ఆ పత్రిక కార్యరూపం దాల్చలేదు. ఇక చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ గురించి వచ్చే పత్రికలు కొద్దికాలనికే మూత పడ్డాయి.ఆ పత్రికల సర్క్యూలేషన్ అంతగా లేకపోవడం కారణం.