ఇన్సైడ్ టాక్ : పవన్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? మళ్ళీ రెడీ అంటున్నాడా.?

Pawan Kalyan

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే పవన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” లో మళ్ళీ జాయిన్ అవ్వనున్నాడని వార్తలు కొన్ని వినిపిస్తున్నాయి. 

అయితే ఈ చిత్రం విషయం పక్కన పెడితే పవన్ కళ్యణ్ కి గత కొన్ని రోజులు కితం ఆరోగ్యం పాడైన సంగతి తెలిసిందే. తన అత్యుత్సహ అభిమాని పవన్ మీద పడిపోవడం వర్షంలో కూడా తన పొలిటికల్ టూర్స్ చేయడంతో వైరల్ ఫీవర్ వచ్చేసింది. దీనితో పవన్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిసింది. 

కానీ తర్వాత అయితే మళ్ళీ పవన్ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అయితే సినీ వర్గాలు సహా పవన్ సన్నిహిత వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం అయితే ఒకటి వినిపిస్తుంది. పవన్ ఇప్పుడు నార్మల్ అయ్యాడని మళ్ళీ తన పొలిటికల్ టూర్ స్టార్ట్ చేయడమే కాకుండా సినిమాల్లో కూడా పాల్గొననున్నట్టుగా ఇన్సైడ్ టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.