టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా త్రివిక్రమ్ ఇప్పటికి ఇద్దరు హీరోస్ తో హ్యాట్రిక్ సినిమాలు చేసాడు కానీ ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా సుమారుగా 200 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తుండగా సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజులు కితమే ఈ సినిమా టైటిల్ పై ఓ క్రేజీ టాక్ అయితే బయటకి వచ్చింది. మరి ఇప్పుడు అయితే ఈ సినిమా నుంచి మరో మాసివ్ ట్రీట్ అదే ఉగాదికి మహేష్ ఫాన్స్ కి రాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.
మరి అదే రోజున ఏఈ సినిమా టైటిల్ మాత్రమే కాకుండా సినిమాకి మహేష్ మహేష్ ప్రిపేర్ చేసిన సిసలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నారట. దీనితో అదే రోజు డబుల్ ట్రీట్ ఖాయం అయ్యిందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో హీరోయిన్స్ గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే మరియు లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల లు నటిస్తున్నారు.
అలాగే థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే వీలైనంత వరకు అయితే ఈ ఏడాది ఆగష్టు 11 రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు లేకపోతే రిలీజ్ మరింత డిలే కావచ్చని టాక్ ఉంది.
