నాన్నను కారు కొనివ్వమంటే చెప్పుతో కొడతా అన్నారు.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన శిరీష్?

అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా మంచి విజయం సాధించడంతో ఈయన సినిమా సక్సెస్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న శిరీష్ కు అలీ నుంచి ఒక వింత ప్రశ్న ఎదురయింది.నాన్న గతంలో ఓసారి చెప్పుతో కొడతా అని తిట్టారట కారణం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు శిరీష్ సమాధానం చెబుతూ నాన్న అల్లు అర్జున్ రామ్ చరణ్ కి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి కారును గిఫ్ట్ గా కొనిచ్చారు.నాకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత కారును గిఫ్ట్ గా ఇవ్వమని అడిగాను అదేవిధంగా ఫలానా ఒక ప్రొడ్యూసర్ కొడుకు కూడా కారులో తిరుగుతున్నారు నాకు కూడా కారు కావాలి అని అడిగాను.నేను ఇలా కారు గిఫ్ట్ గా అడగడంతో నాన్న ఒక్కసారిగా కోపం తెచ్చుకొని చెప్పు తీసి కొడతా అని తిట్టారు. నేను ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను మిగిలినది నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కో అని చెప్పారు.

ఈ విధంగా నాకు 21 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బు విలువ నాకు తెలియదు అందుకే డబ్బు విలువ తెలియడం కోసమే నాన్న నన్ను ఆ రోజు అలా తిట్టారని,డబ్బు విషయంలో సినిమాల జడ్జిమెంట్ విషయంలో నాన్న ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకుంటారంటూ ఈ సందర్భంగా శిరీష్ తన తండ్రి గురించి అలాగే గతంలో తన తండ్రి తిట్టిన తిట్ల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.ఈ విధంగా అల్లు శిరీష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.