Allu Arjun: పోలీసు తీరుపై అసహనం వ్యక్తం చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పట్ల అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడం ఈయన దేశవ్యాప్తంగా సక్సెస్ స్టోర్ వెళుతూ ఉండగా పోలీసులు వచ్చే సడన్గా ఈయనని అరెస్టు చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఈయన అరెస్టుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసు తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షో వేయగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ వద్దకు వెళ్లారు అయితే పెద్ద ఎత్తున అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ అభిమాని మరణించారు.

ఇలా అభిమాని మరణం పట్ల అల్లు అర్జున్ స్పందించారు తన అభిమాని మరణించడం బాధాకరం వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని ఈయన ఒక వీడియో ద్వారా వెల్లడించారు. అయితే ఈయనపై కేసు నమోదు కావడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమక్షంలో అల్లు అర్జున్ అరెస్టు చేశారు అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేయడానికి రావడంతో అక్కడే అల్లు అరవింద్ స్నేహ రెడ్డి బన్నీ వాసు అల్లు శిరీష్ వంటి వారందరూ కూడా ఉన్నారు. అయితే పోలీసులతో అల్లు అర్జున్ మాట్లాడుతూ మీరు అరెస్టు చేయడం తప్పులేదు నేను కూడా మీకు సహకరిస్తాను కానీ నేను వెళ్లిన అడ్రస్ మార్చుకుంటాను అని చెప్పినప్పటికీ పోలీసులు కూడా బెడ్ రూమ్ వరకు వస్తామని చెప్పడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

నా డ్రెస్ మార్చుకుంటానని చెప్పగా మీరు బెడ్ రూమ్ వరకు వస్తానని చెప్పడం చాలా టూమచ్ సర్ ఇది కరెక్ట్ కాదు అంటూ అల్లు అర్జున్ పోలీస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు .అయితే ఆయన అదే డ్రస్ లోనే పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇక ఈయనతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్తున్న సమయంలో అల్లు అరవింద్ ను వద్దని చెప్పి అల్లు అర్జున్ మాత్రమే పోలీసులతో సహా స్టేషన్ కి వెళ్లారు.