శరవేగంగా బాలయ్య సినిమా చిత్రీకరణ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’ సినిమాలతో వరుస బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందుకున్న బాలయ్య..తన తరువాత సినిమా పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్ టైనర్ ఎన్‌బికె 109 అనే వర్కింగ్‌ టైటిల్‌ తో వస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలైంది. మొదటిసారి బాబీ బాలయ్య ఊరమాస్‌ కాంబోలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ‘యానిమల్‌’తో మెప్పించిన బాబీడియోల్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవలే తను ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు.

బాలకృష్ణ, బాబీడియోల్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీన్స్‌ పోటాపోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా షూటింగ్‌ కానిచ్చేస్తున్న మేకర్స్‌..రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా మొదలు పెట్టే ముందు దసరాకి రిలీజ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారు.

కానీ ఈ సినిమా మే లేదా జూన్‌ నెలలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌ వీలైనంత త్వరగా పూర్తిచేసి జూన్‌ లో రిలీజ్‌ చేసేందుకు షూటింగ్‌ శరవేగంగా జరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌ విషయంపై..త్వరలో మేకర్స్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.