Director Gunasekhar: పాపం.. గుణశేఖర్ పరిస్థితి  పురాణాల్లోని శకుంతల స్థితి  కంటే దారుణం !  

Director Gunasekhar: గుణశేఖర్  డైరెక్షన్ లో  ‘సమంత’ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ‘ శాకుంతలం’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవుతుందన్నారు. ఈ మధ్య అయిందని కూడా ప్రచారం జరిగింది. ఇలా ఈ సినిమాకు సంబంధించిన పుకార్ల పరంపరలో  ఎన్నో  పుకార్లు వినిపించాయి. కథలో మ్యాటర్ సరిపోదేమో అనే అనుమానంతో  ,  గుణశేఖరే సినిమాకి పాజ్ బటన్ నొక్కాడు అని,  లేదు.. సమంత గ్లామర్ బాగా  దెబ్బ తింది అని..  ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అయితే, గుణశేఖర్ శాకుంతలం సినిమా ఎపిసోడ్ లో  ‘సమంత విడాకులే’  ప్రధాన విలన్. అక్కినేని బ్రాండ్ పుణ్యమా అని  సమంత ను పెట్టుకుని భారీ రిస్క్ చేయడానికి పూనుకున్నాడు గుణశేఖర్.  బడ్జెట్ పరిమితులు కూడా పెట్టుకోలేదు. 70 – 80 కోట్ల రేంజ్ అనుకుని ముందుకు వెళ్ళాడు.  కట్ చేస్తే..  సీన్ రివర్స్ అయింది. సమంత పేరులో నుంచి అక్కినేని పేరు పోయింది. ఆమెకు ఉన్న బ్రాండ్ వాల్యూ తగ్గింది.

ఈ క్రమంలోనే గుణశేఖర్ కి శాకుంతలం విషయంలో స్వేచ్ఛ లేకుండా పోయింది. దీనికితోడు, సమంత అనారోగ్యం. గుణశేఖర్ కి అంతు చిక్కడం లేదు.  శాకుంతలాన్ని ఏం చేయాలా ? అని గుణశేఖర్ ప్రస్తుతం ఆపసోపాలు పడుతున్నాడు. నిజానికి గుణశేఖర్  ఈ సినిమాని బాగానే తీసినా.. ఒక్క క్లైమాక్సే మింగుడు పడడం లేదు.  శాకుంతలం క్లైమాక్స్ దగ్గరే  గుణశేఖర్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. అసలుకే  ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలని గుణశేఖర్ ఆశ  పడుతున్నాడు. అందుకే, శాకుంతలం  క్లైమాక్స్ ను అద్భుతంగా ప్లాన్ చేయాలి.  మళ్లీ బడ్జెట్ లిమిట్  లోనే ఉండాలి. అంటే.. డబ్బుతో కాకుండా  కథ ముగింపుతోనే,  సమంత పాత్రతోనో  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవాలి.  ఇక్కడే గుణశేఖర్ కి  బాగా లేటు అవుతుంది. శాకుంతలానికి  ఆ రేంజ్ ఎండింగ్ ఇవ్వాలంటే.. మొదటి సీన్ నుంచి కథ టెంపోను అలాగే మెయింటైన్ చేస్తూ రావాలి.  కానీ, ఇక్కడ శాకుంతలం లో ఆ టెంపో కుదరడం లేదు, ఆ అద్భుతమైన ముగింపు  ఏ మాత్రం పలకడం లేదు. పైగా ఈ కథ ఇప్పటికే పరిచయం ఉంది.

అయినా,  అనగా అనగా రాగం  తినగా తినగా రోగం అని,  శాకుంతలం కథ పైనే మూడేళ్ల నుంచి కుస్తీ పట్టి పట్టి  గుణశేఖర్ కి ఉన్నదే అద్భుతం అనిపిస్తుంది. కథకు సంబంధం లేని రైటర్ సత్యానంద్, పరుచూరి గోపాల్ కృష్ణ లాంటి బయట వ్యక్తులకు ఇదొక సాధారణ కథ అని అర్థమవుతుంది. అందుకే..  శాకుంతలం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పైగా ఈ మధ్య సమంత  ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. వీటన్నిటి మధ్య  గుణశేఖర్.. శాకుంతలం లో  ప్రతి సీన్ ను అద్భుతం అనిపించేలా తీయడంలో బాగా ల్యాగ్ అయిపోతుంది. సో,  ఆ సీన్ ఇలా కాదు,  ఈ సీన్ అలా కాదు అన్న దగ్గరే గుణశేఖర్ శాకుంతలం అటు ఇటు తిరుగుతూ ఉంది. అందుకే, అదిగో  శాకుంతలం రిలీజ్ అంటే, ఇదిగో  శాకుంతలం పోస్ట్ ఫోన్ అంటూ  రెగ్యులర్ గా అప్ డేట్లు వస్తూనే ఉన్నాయి. పాపం గుణశేఖర్ పరిస్థితి,  పురాణాల్లోని శకుంతల స్థితికి కంటే దారుణంగా ఉంది.