విహారయాత్రకు బయలు దేరిన చిరంజీవి. కామెంట్ చేసిన ఉపాసన!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లకు కాస్త విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న చిరు షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చి తన సతీమణి సురేఖ తో కలిసి విదేశాలకు బయలుదేరారు.

ఇదే విషయాన్ని చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కరోనా పాండమిక్ తరువాత తొలి ఇంటర్నేషనల్ జర్నీ.. చిన్న హాలిడే తీసుకొని సురేఖ తో కలిసి చాలా రోజుల తర్వాత యూఎస్ వెళ్తున్నాను.. త్వరలోనే మీ అందర్నీ కలుస్తాను అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తాను యూఎస్ వెళుతున్న విషయాన్ని తన అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా చిరంజీవి మెసేజ్ తో పాటుగా సురేఖతో ఫ్లైట్ లో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక చిరంజీవి చేస్తున్న పోస్టుపై కోడలు ఉపాసన కొణిదెల స్పందిస్తూ హ్యాపీ టైం అత్తయ్య మామయ్య అంటూ కామెంట్ చేసింది.. అంతేకాకుండా ఆ ఫోటో ని చూసిన చిరు అభిమానులు సెలబ్రిటీలు అందరూ హ్యాపీ జర్నీ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. ఇక పోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి సరసన రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. భారీగా ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.