అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చలపతి రావు..?

టాలివుడ్ లో ఎంతో మంది నటీనటులుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా నటుడిగా మంచి గుర్తింపు పొందిన చలపతిరావు గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న చలపతిరావు మొదట నాటకాలు వేస్తూ జీవించేవారు. ఆ తర్వాత సినిమాలలో నటించే అవకాశం రావడంతో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు చేశాడు. అయితే వయస్సు పెరగటం వల్ల చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న చలపతిరావు తాజాగా కార్డియాక్ అరెస్ట్ వల్ల కన్ను మూశారు. ఈయన ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ వరుసగా మరణించటంతో ఇండస్ట్రీ ఆ విషాదం నుండి బయటపడలేక పోతోంది. ఇక తాజాగా చలపతిరావు మరణంతో ఇండస్ట్రీలో మరింత విషాదం నెలకొంది. కొంతకాలంగా చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చలపతిరావు తాజాగా గుండెపోటు వల్ల మరణించాడు. అయితే గతంలో కూడా ఒకసారి ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎన్నో సినిమాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన చలపతిరావు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.

గతంలో చలపతి రావు గారు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. సోషల్ మీడియాలో ఆయన మీద విమర్శలు వినిపించాయి. మహిళల గురించి చలపతి రావు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో కూడా తెగ ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇలాంటి వ్యక్తి బతికుంటే ఏంటి ? చస్తే ఏంటి? అని తీవ్రంగా విమర్శించారు. దీంతో ఆ అవమానాలను ఎదుర్కోలేక ఒకానొక టైంలో ఆయన సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కానీ తన కొడుకు మాటలతో మళ్లీ తిరిగి ఆ డిప్రెషన్ నుండి బయటపడ్డారు .