రాత్రి సమయాల్లో భోజనం లేటుగా తినే అలవాటు ఉంటే తక్షణమే మార్చుకోండి..!

guy-eating-at-fast-food-restaurant

నాగరికత పెరిగే కొద్దీ మన నిత్య జీవన విధానంలో చాలా మార్పులే సంతరించుకుంటున్నాయి. కొన్ని మార్పులు మన అభివృద్ధికి తోడ్పడితే మరికొన్ని మార్పులు మనలో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ రోజుల్లో సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం చాలామంది జీవితాల్లో దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు. ఎవరి కారణాలు వాళ్ళు చెబుతుంటారు. కారణాలు ఏవైనా సమయానికి తినలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.

ఈ రోజుల్లో చాలామందికి తిని, పడుకునే సమయం అర్థరాత్రి దాటుతోంది. రాత్రి ఎప్పుడో 10 గంటలకు తిని వెంటనే పడుకుంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్టిక్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో ఆహారం గొంతులో చేరి గొంతు మంట, గుండెల్లో మంట అంటే సమస్యలు తలెత్తుతాయి. ఒక్కొక్కసారి నిద్రలో పోర పోవడం వల్ల ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల శరీర జీవక్రియలు మందగించడం వల్ల వినియోగించే క్యాలరీలు సరిగా కరిగిపోవు ఫలితంగా శరీరలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఉబకాయ, గుండెపోటు, రక్తపోటు, చక్కెర వ్యాధి సమస్యకు దారి తీస్తుంది.

 

మానసిక నిపుణుల సూచనల ప్రకారం ఈ రోజుల్లో చాలామందిలో తలెత్తే మానసిక ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలకు నిద్రలేమి సమస్య కారణమని అనేక సర్వేలో వెళ్లడైందట. చాలామందిలో నిద్రలేమి సమస్యకు కారణం లేటుగా భోజనం చేయడం. కనుక ఈ అలవాటు మీలో ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషక పదార్థాలతో కూడిన ఆహారం ఎంత అవసరమో ఆహారాన్ని సమయానికి తినడం కూడా అంతే ముఖ్యం. రాత్రి సమయాల్లో కచ్చితంగా
7 నుంచి రాత్రి 8 గంటల మధ్యే భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో భోజనం చేస్తే మనం పడుకునే సమయానికి తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది నిద్రలేమి సమస్య తలెత్తదు.