నిద్ర అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. అయితే సరైన సమయానికి నిద్ర రావడం కూడా అదృష్టమని కొందరు భావిస్తుంటారు.ఇక నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు అయితే నిపుణులు ఇలా చెప్పారు కనుక అతిగా నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి.
నిద్ర ఎక్కువైనా.. తక్కువైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మనిషికి నిద్ర అనేది అత్యవసరం. నిద్ర లేనిదే మన ఆరోగ్యంగా ఉండలేము.
సాధారణంగా 6 నుంచి 8 గంటలు నిద్ర పోవాలిన వైద్యులు చెబుతుంటారు. మనం అలసిపోయినా.. అనారోగ్యంతో ఉన్నా ముందుగా వచ్చేది నిద్రే. నిద్రలోకి జారుకుంటే మన అలసట ఎగిరిపోతుంది. అయితే అతిగా నిద్రపోయినా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. తాజా పరిశోధనల ప్రకారం ఎవరైతే ఎక్కువగా నిద్రకు ప్రాధాన్యత ఇస్తారో అలాంటి వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రోజూ మధ్యాహ్నం 30 నిమిషాల పాటు కునుకు తీసే వారితో పోలిస్తే 90 నిమిషాలు నిద్రపోయే వారిలో గుండె పోటు ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధన తేల్చింది.
30 నిమిషాలు మాత్రమే నిద్రపోయే వారిలో గుండెపోటు ముప్పు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. .ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం నిద్రపోని వారిలో గుండె పోటు వచ్చే అవకాశమే ఉండదని పరిశోధన తేల్చింది. అతిగా నిద్రపోయే వారిలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉండటం వల్ల వారి చాతి సైజు పెరిగి గుండె సమస్యలకు కారణమవుతుందని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ 7 గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్ర పోయే వారితో పోల్చితే 9 గంటలు కంటే అధికంగా నిద్రపోయేవారికి గుండెపోటు 25 శాతం ఎక్కువని గుర్తించామన్నారు. అందుకే సరైన సమయం మాత్రమే నిద్రపోతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు హెచ్చరించారు.