బిగ్ న్యూస్ : ఆస్కార్స్ లో ఎన్టీఆర్ కి అవమానం??

ఇండియన్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా కూడా మరో లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి అయితే తాను చేసిన బిగ్గెస్ట్ ఏక్షన్ ఫ్లిక్ చిత్రం “ఆర్ ఆర్ ఆర్” అని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందుకున్న ఫేమ్ కానీ రీచ్ కానీ ఇండియన్ సినిమా నుంచి మరో చిత్రానికి రాలేదు.

కాగా ఈ చిత్రంలో నటించిన హీరోస్ కి కూడా మంచి గుర్తింపు ఫారిన్ ఆడియెన్స్ లో రాగా ఇద్దరు హీరోస్ విషయంలో మొదటి నుంచి మెయిన్ హీరో ఎవరు అనేది టాపిక్ గా రాగ చరణ్ మెయిన్ హీరో ఎన్టీఆర్ తనకి సపోర్టింగ్ హీరో అనే మొదటి రోజు నుంచే టాక్ వచ్చింది.

అయితే ఆస్కార్ వరకు కూడా ఈ రచ్చ నడవగా అక్కడ ఆస్కార్ అవార్డు టైం లో ఎన్టీఆర్ పిక్ నే పెద్దగా వేశారు అని అంటే ఎన్టీఆర్ నే మెయిన్ హీరో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్టీఆర్ కి సహా పలువురు హాలీవుడ్ నటులకి ఆస్కార్ లో అయితే కొత్త సభ్యులుగా ఎంట్రీ ఇవ్వడంతో తారక్ పేరు మరోసారి మారుమోగుతోంది.

కాగా ఇక్కడ కూడా అంతా ఆసక్తిగా ఉన్న అంశం ఏమిటంటే ఆస్కార్ వారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్విస్ట్ ఇచ్చారు అని చెప్పాలి. ఎందుకంటే వారు అనౌన్స్ చేసిన నటుల్లో మిగతా ఎవరు కూడా ఏ చిత్రాల్లో మెయిన్ లీడ్ గా నటించింది లేదు. అందరూ ఏఒక్క చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలు మాత్రమే చేశారు.

అంటే ఈ లెక్కన వారితో పాటుగా ఈ లిస్ట్ ఉన్న ఎన్టీఆర్ ని కూడా ఒక సపోర్టింగ్ నటుడు గానే చూసి తీసుకున్నట్టే అనుకోవాలి కదా?? దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్లీ ఖంగుతున్నారని చెప్పక తప్పదు. అయితే మరో లిస్ట్ లాంటిది ఏమన్నా వస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.