Beast: హిందీలో మాత్రం పేరు మార్చుకున్న బీస్ట్..!

Beast: తమిళ్ సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు.ఈ సాలిడ్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ను మేకర్స్‌ పూర్తి చేశారు.ఈ భారీ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ పతాకం పై కళానిది మారన్‌ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్షేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం  అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన హలమితి హబిబో..పాట, తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన రెండో పాట జాలీ ఓ జింఖానా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో విజయ్ జాలీ ఓ జింఖానా పాట స్వయంగా పాడారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.బీస్ట్‌ మూవీని పాన్‌ ఇండియా సినిమాగా సౌత్‌లోని అన్నీ భాషలతో పాటుగా హిందీలోనూ రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా మేకర్స్‌ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ ఇచ్చారు. అంతేకాదు, అన్నీ భాషలలో ‘బీస్ట్‌’ పేరుతో రిలీజ్‌ కానున్న ఈ సినిమాను హిందీలో మాత్రం ‘రా’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండటం విశేషం.