రామ్‌చరణ్‌కు ‘పుష్ప’ బర్త్‌డే విషెస్‌…!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ విూడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు చరణ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేసారు. చరణ్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు.

ఈ సందర్భంగా స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌ డే మై మోస్ట్‌ స్పెషల్‌ కజిన్‌.. లవ్‌ యూ’ అంటూ విషెస్‌ తెలిపాడు అల్లుఅర్జున్‌. ఇక ఈ వీడియో చూస్తే.. బన్నీ, చెర్రీ ఏదో ఈవెంట్‌లో ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తున్నట్లు ఉంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.