Akhanda Sensation: మళ్ళీ దుమ్ము లేపిన “అఖండ”..అన్ని సౌత్ సినిమాలు దాటేసి భారీ రికార్డ్.!

akhanda sensation in ott platform in south india
Akhanda Sensation: గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం “అఖండ” కూడా ఒకటి. బాలయ్యకి ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా వారి కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.
బాలయ్య కెరీర్ లోనే భారీ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత మళ్ళీ అంతా ఓటిటి లో స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా చూస్తుండగా హాట్ స్టార్ లో ఈ సినిమా 50 రోజుల తర్వాత రిలీజ్ కి వచ్చింది. అయితే మొదటి రోజే రికార్డు రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు దక్షిణాది సినిమాలోనే టాప్ సినిమాగా నిలిచినట్టు జాతీయ కథనాలు చెబుతున్నాయి.
గత ఏడాది కాలంలో చాలానే అన్ని భాషల సినిమాలు ఓటిటి లో వచ్చాయి కానీ వాటి అన్నిటినీ మించి భారీ రెస్పాన్స్ తో అఖండ మొదటి స్థానంలో నిలబడింది. ఈ లిస్ట్ లో చాలానే ఇతర డైరెక్ట్ ఓటిటి రిలీజ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని దాటి టాప్ ప్లేస్ లో ఈ సినిమా నిలవడం విశేషం.
అంటే ఈ లెక్కన ఓటిటి లో కూడా ఆడియెన్స్ ఏ రేంజ్ లో చూసారో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా శ్రీకాంత్, పూర్ణ తదితరులు నటించారు. అలాగే దర్శకుడు బోయపాటి దీనికి సీక్వెల్ కూడా చేయనున్నారు.