Chiranjeevi : మెగాస్టార్ కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్, రామ్ చరణ్ మొదటిసారి ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో నటిస్తున్నారు. ఇక షూటింగ్ పూరైన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల తేదిని ఖరారు చేసారు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. ఇక రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రచార కార్యక్రమాలు కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు . ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా భారీ స్థాయిలో అయితే స్పందన వచ్చింది. మణిశర్మ చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేస్తుండగా ఒక వారం కంటే ముందుగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ఇటీవల నిర్మాతలు తెలియజేశారు.
ఇక ఆ ప్లాన్ కు తగ్గట్టుగానే ఏప్రిల్ 24వ తేదీన ఆచార్య రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీసు మైదానం లో ఈవెంట్ జరగనుంది ఇక ఈవెంట్ కి మెగాస్టార్, రామ్ చరణ్, ఇంకా కొంత మంది టాలీవుడ్ హీరోలు హాజరవ్వబోతున్నారట.ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తేజ్ పాత్ర 20 నిమిషాలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. సిద్దా అనే నక్సలైట్ పాత్రలో మెగాస్టార్ కు సహాయంగా కొనసాగే వారియర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.
ఇక ప్రస్తుతం అయితే సినిమా ట్రైలర్ పైనే అందరి ఫోకస్ ఉంది. ట్రైలర్ ను ఈ నెల 14న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఆ విషయంలో కూడా ఓ క్లారిటీ రానుంది. సినిమా విడుదల కంటే ఒక రెండు వారాల కంటే ముందుగానే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా ఆచార్య సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ విజయంతో రామ్ చరణ్ కు బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.