`రేసుగుర్రం` సీక్వెల్ ఇస్మార్ట్ రామ్‌తోనా?

race gurram sequel with ismart Ram?

చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ .. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. ఇలా వ‌రుస‌గా స్టార్ హీరోల‌తోనే సినిమాలు చేసి స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. కెరీర్ లో చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ఉన్నాయి. బ‌న్నికి రేసుగుర్రం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన సూరి అటుపై చ‌ర‌ణ్ కి ధృవ లాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాడు.

వీట‌న్నిటినీ మించి సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి పాన్ ఇండియా గిఫ్ట్ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చాడు. ఈ సినిమా చిరు ఇమేజ్ ని అమాంతం పెంచింది. తెలుగు-త‌మిళం స‌హా హిందీ క్రిటిక్స్ ని ఈ మూవీ ఎంతో మెప్పించింది. అయితే పాన్ ఇండియా స్థాయి క‌లెక్ష‌న్స్ తేవ‌డంలో వంద శాతం స‌ఫ‌లం కాక‌పోయినా సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని అందుకున్నామ‌ని నిర్మాత‌గా చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు అంటే అది సూరి కి ద‌క్కే క్రెడిట్.

సైరా లాంటి స్పెష‌ల్ సినిమా చేశాక అత‌డు వెంట‌నే బ‌న్నితో సినిమా చేయాల్సింది. కానీ ఎందుక‌నో అది హోల్డ్ లోనే ఉండిపోయింది. ప్ర‌స్తుతం అద్భుత‌మైన అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల టీమ్ ని సెట్ చేసుకుని వ‌రుస‌గా సినిమాల్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతున్న సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాని ఘ‌నంగానే ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న రామ్ పోతినేని హీరోగా ఓ చిత్రానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

రెడ్ మూవీ పూర్తి చేసాక‌ రామ్ సురేందర్ రెడ్డి సినిమాలో న‌టిస్తాడు. రామ్ ని మ‌రో రేసుగుర్రం రేంజు హీరోయిజంతో ఎలివేట్ చేసే స్క్రిప్టుని సూరి రెడీ చేశాడ‌ట‌. ఆ సబ్జెక్టు రామ్ స్టార్ డమ్ పెంచేలా ఉంటుందట. అయితే బ‌న్నితో చేయాల్సినది రామ్ తో చేస్తున్నాడా?  ఇది రేసుగుర్రం సీక్వెల్ స్క్రిప్టుతోనా? అన్న‌ది తేలాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.