‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల తేదీ వాయిదా!

టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ , రామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్‌లను ఇవ్వగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాను మొదట మార్చి 8న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తుంది. షూటింగ్‌ ఆలస్యం అవ్వడం అనుకున్న టైమ్‌కి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పెండింగ్ ఉండడంతో ఈ సినిమాను జూన్‌ 14న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.