ప్రస్థుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని సందర్భాలలో నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఇప్పుడు అందరూ తమ ఇంట్లో వైఫై కనెక్షన్ పెట్టుకుంటున్నారు. ఈ వైఫై కనెక్షన్ అధిక ధరతో కూడుకున్నది. వైఫై కనెక్షన్ కోసం రూ.2000 నుంచి రూ.4000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత మీరు ఒక ప్లాన్‌ని ఎంచుకొని ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ ఇంట్లో ఇంటర్నెట్ నడుస్తుంది.
అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో వైఫై సిగ్నల్స్ చాలా నెమ్మదిగా ఉంటాయి. సాధారణ వీడియోలను కూడా చూడటానికి వీలు ఉండదు. ఇలా జరగటం వల్ల ఆఫీసు పని చేసేవారికి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే అప్పుడప్పుడు వైఫై సిగ్నల్స్ స్లో అవ్వటానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ పాటించటం వల్ల ఈ సమస్యని తొలగించవచ్చు. వైఫై సిగ్నల్స్ ఫాస్ట్ గా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
wifi రూటర్ స్థానాన్ని మార్చండి :
సాధారణంగా WiFi నుంచి మంచి ఇంటర్నెట్ స్పీడ్ పొందడానికి WiFi రూటర్ స్థానం సరిగ్గా ఉండటం అవసరం. సిగ్నల్స్ సరిగా లేని ప్రదేశంలో wifi రూటర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఇంటర్నెట్ వేగం నెమ్మదవుతుంది. ఇంటికి సెంటర్లో కొంచెం ఎత్తులో వైఫై రూటర్‌ని ఉంచితే ఇంటి మొత్తం ఇంటర్నెట్ కవరేజీని పొందుతారు. ఇలా చేయటం వల్ల ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు.
ఆప్టిమైజేషన్ :
సాధారణంగా వైఫై సేవలను అందించే కంపెనీలు తమ వైఫై కనెక్షన్‌తో పాటు యాప్‌లను కూడా అందిస్తున్నాయి. WiFi కనెక్షన్ నెమ్మదిగా నడుస్తున్నట్లయితే యాప్‌ని ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఉదాహరణకు ఎయిర్‌టెల్ తన ఫైబర్ సర్వీస్‌లో ఆప్టిమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల WiFi రూటర్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చాలా వరకు పెంచుకోవచ్చు.