ఏసి కొనుగోలు చేయాలనుకుంటున్నారా… అయితే అతి తక్కువ ధరలో దీనిని మీ సొంతం చేసుకోండి..?

శివరాత్రి ముగియగానే చలికాలం కూడా పూర్తిగా ముగిసిపోయి వేసవికాలం మొదలవుతుంది. వేసవికాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతల భారీ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంట్లో ఏసీ, కూలర్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. చలికాలం ఇంకా పూర్తికాకముందే రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో చల్లగా ఉండటం కోసం ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కువ ధరతో కూడుకున్నవి. అందువల్ల అత్యధిక మొత్తంలో ధర చెల్లించి వీటిని కొనుగోలు చేయడానికి సామాన్య ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు.

అయితే ఈ వేసవి కాలంలో సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేయగలిగే ధరలో కొన్ని రకాల కంపెనీలు ఏసీలను మార్కెట్లోకి తెచ్చాయి. తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన ఎన్నో రకాల ఏసీలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా, MarQ కంపెనీ శక్తివంతమైన 4 ఇన్ 1 కన్వర్టిబుల్ ఎయిర్ కండీషనర్‌ల కొత్త శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలనే ఇంటిని చల్లబరచడం ఈ ఎయిర్ కండిషనర్ ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేక ఫీచర్ కలిగిన ఎయిర్ కండిషనర్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి రేటింగ్ అండ్ రివ్యూ చూస్తున్నారు. తాజాగా MarQ విడుదల చేసిన 4 ఇన్ 1 కన్వర్టిబుల్ ఏసీ ఎన్నో అత్యత్తమ ప్రయోజనాలనే అందిస్తుందని కంపెనీ వెల్లడించింది ఈ సరికొత్త ఫోర్ ఇన్ వన్ కన్వర్టబుల్ ఏసీలో ‘టర్బో కూల్ మోడ్’ ఫీచర్ ఉండటం వల్ల సాధారణ ఏసీలతో పోలిస్తే.. 19 శాతం ఎక్కువుగా 20 నిమిషాల్లో గదిని చల్లబరుస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా దీనిలో ఉన్న ECO మోడ్ వల్ల కరెంటు బిల్లు కూడా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ MarQ కొత్త రకం ఏసీ శ్రేణిలు “ఇన్వర్టర్ టెక్నాలజీ”తో పాటు తాజా బీ స్టార్ రేటింగ్‌తో వస్తున్నాయి. MarQ మొత్తం 6 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర
రూ. 25999 నుంచి మొదలుకానుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత తీవ్రతను భరించలేక ఏసీ కొనాలనుకునేవారు అతి తక్కువ ధరలో MarQ విడుదల చేసినఈ 4 ఇన్ 1 కన్వర్టిబుల్ ఏసీ ని కోనుగోలు చేయవచ్చు.