ఎక్కువ సమయం ఏసీలో ఉండేవాళ్ళకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యలతో ముప్పు తప్పదట!

ఎక్కువ సమయం ఏసీలో ఉండడం వల్ల చర్మం పొడిబారడం, కళ్ళు పొడిబారడం, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి మరియు అలెర్జీలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏసీ గాలిలో తేమ ఉండదు, ఇది చర్మం పొడిబారడానికి, దురదకు దారితీస్తుంది. ఏసీ గాలి చర్మంలోని తేమను తొలగిస్తుంది, దీని వలన చర్మం పొడిబారి, దురద పెట్టడం, పొలుసులుగా మారడం వంటి సమస్యలు దీర్ఘ కాలంలో తలెత్తుతాయి.

ఏసీ గాలి కళ్ళలోని తేమను కూడా తగ్గిస్తుంది, దీని వలన కళ్ళు పొడిబారి, దురదగా అనిపించవచ్చు. ఏసీ గాలి గొంతు మరియు ముక్కులో పొడిబారడానికి కారణమవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏసీ గాలిలో ఉండే దుమ్ము, పురుగులు మరియు ఇతర అలెర్జీ కారకాలు అలెర్జీలు, ఆస్తమా వంటి సమస్యలను పెంచుతాయి.

ఏసీ గాలిలో తేమ తక్కువగా ఉండడం వలన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది, దీని వలన డీ హైడ్రేషన్ బారిన పడవచ్చు. ఎక్కువ సమయం ఏసీలో ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది, దీని వాళ్ళ ఇన్ఫెక్షన్ల రిస్క్ సైతం పెరుగుతుందని చెప్పవచ్చు. ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. ఎందుకంటే, ఏసీ గాలి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది.

ఎక్కువసేపు ఏసీ గదులలో ఉండటం వల్ల సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తలనొప్పి, అలసట, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి రావచ్చు. ఏసీ నుండి బయటకు వచ్చినప్పుడు, బయటి ఉష్ణోగ్రతకు శరీర ఉష్ణోగ్రత సర్దుబాటు అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈ మార్పుల వల్ల కొన్నిసార్లు జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు.