మీ ఏసీ కూలింగ్ రావడం లేదా… ఈ సింపుల్ చిట్కాలను పాటించాల్సిందే!

వేసవికాలం రావడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో మార్పులు రావడంతో వేడి తాపం అధికమవుతుంది ఈ క్రమంలోనే వేసవికాలం వచ్చిందంటే 24 గంటలు ఏసీలు ఆన్లోనే ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే ఏసీ ఆన్ లో పెట్టినప్పటికీ కూలింగ్ రాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఏసీ కూలింగ్ కనుక రాకపోతే ఈ సింపుల్ అయితే చిట్కాలను పాటిస్తే చాలు…

ఏసీలో కండన్సర్ కాయిల్ అనేది బయట ఉండే యూనిట్ లో ఉంటుంది. అది ఎప్పుడూ బయటే ఉండటం వల్ల గాలికి దుమ్ము, ధూళి పేరుకుపోవడం వల్ల మనకు ఏసి నుంచి కూలింగ్ రావడం ఆగిపోతుంది అందుకే ఈ కండెన్సర్ కాయిల్ ముందు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఏసీ కూలింగ్ కాకపోతుంటే.. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఎయిర్ ఫిల్టర్స్‌. అవును ఎయిర్ ఫిల్టర్స్‌ ఎక్కువగా డస్ట్‌ తో నిండి ఉంటాయి.ఇలా ఎయిర్ ఫిల్టర్స్ డస్ట్ నిండి ఉండడం వల్ల కూలింగ్ అనేది ఆగిపోతుంది అందుకే ఈ ఎయిర్ ఫిల్టర్స్ తరచూ గమనిస్తూ శుభ్రం చేస్తూ ఉండాలి.

క్వాలిటీ విద్యుత్ లభిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. లేదా కంటిన్యూస్ గా ఏవర్ లోడ్ పడటం వల్ల కూడా ఏసీ మోటర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కనుక మోటార్ చెక్ చేసుకుంటూ ఉండాలి.ఇలా మోటార్ కనుక పాడై ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోవడం మంచిది. ఏసీలో కంప్రెసర్ అనేది చాలా ముఖ్యమైంది. కొన్నిసార్లు కంప్రెసర్ కూడా పాడవుతూ ఉంటుంది. కంప్రెసర్‌ వర్క్ చేయకోపోయినా కూడా మీ ఏసీ సరిగ్గా కూలింగ్ కాదు.ఇక వేసవి ప్రారంభానికి ముందే ఒకసారి ఏసు సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల కూడా తొందరగా మన రూమ్ కూల్ అవుతుంది.