ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే వేసవి కాలం మొదలయ్యింది. ఇక ప్రస్తుతం అధికంగా ఉంటుంది. మార్చ్ నెలలోనే ఇలా ఎండలు మండిపోతుంటే ఏప్రిల్, మే నెలలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత వేడికి భరించలేక చాలామంది చల్లదనం కోసం ఏసీలు, కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు ఏసీలు అనుకొనటానికి వెనకడుగు వేస్తున్నారు. వేసవికాలంలో చల్లదనం కోసం వేసి కొనాలనుకునే వారికి ఒక శుభవార్త. ఇప్పుడు కూలర్ కంటే చౌకగా లభించే మిని ఏసీ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది.
ఈ ఏసీకి ఆన్‌లైన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ పోర్టబుల్ మినీ ఏసీని చాలా కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టాయి. ఇక ఈ మినీ ఏసీలు సామాన్యులు కూడా కొనగలిగే విధంగా కేవలం రూ.2 వేల లోపు ధరకే లభిస్తుండడం విశేషం. అయితే ఫ్లిప్ కార్ట్ మార్కెట్‌లో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అవును, ఈ మినీ పోర్టబుల్ ఏసీని ఫ్లిప్‌కార్ట్‌లో ఇపుడు రూ. 1500కి అందుబాటులో కలదు. ఈ AC గదికి అనుగుణంగా రూపొందించబడింది. ఇది చాలా తేలికగా ఉండటమే కాకుండా ఒక చోటు నుండి మరో చోటకు తీసుకువెళ్లడం చాలా సులభం.
ఈ మినీ ఏసీ ని గది లో ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇది విద్యుత్తు తో నడిచేది మాత్రం కాదు. దీనికి USB కనెక్టర్ కూడా ఉంది. దీన్ని చాలా సులభంగా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకొనే వీలుంది. దానిని ఇంట్లోనే కాకుండా ఆఫీసు లో, ఆరు బయట ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. త్వరగా గది వేడి ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలోకి తీసుకురావటం దీని విశేషం. ఇది గదిని వేగం గా చల్లబరుస్తుంది. వేసవి ఉష్ణోగ్రతల తాపం నుండి విముక్తి పొందటానికి అతి తక్కువ బడ్జెట్లో మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ నుండి ఈ మినీ పోర్టబుల్ ఏసీ ని సులభంగా కొనుగోలు చేయవచ్చు.