ఈ లక్షణాలు ఉంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం.. ఈ విషయాలు తెలుసా?

గుండె సంబంధిత సమస్యల లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి. సాధారణంగా, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, అలసట, కాళ్ళు మరియు కాలివేళ్ళలో వాపు, వికారం, వాంతులు, తలనొప్పి, మైకము లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో, గుండె సంబంధిత సమస్యలు ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చు. ఛాతీలో ఒత్తిడి, భారం లేదా అసౌకర్యం ఉంటే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విశ్రాంతిలో కూడా శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటే కూడా వైద్యులను సంప్రదించాలి. చిన్న పని చేసినా విపరీతంగా అలసటకు గురవుతుంటే ఈ లక్షణం గుండె సమస్యలకు సంబంధించి లక్షణం కావచ్చు. కాళ్ళు, చీలమండలు లేదా పాదాలలో ద్రవం చేరడం లేదా వాపు గుండె సమస్యలను లేదా కిడ్నీ సంబంధిత సమస్యలను సూచిస్తుంది.

కడుపులో అసౌకర్యం, వికారం లేదా వాంతులు లాంటి సమస్యలు వేధిస్తుంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి. తలలో నొప్పి, కొన్నిసార్లు మెడ, దవడ, గొంతు లేదా పై బొడ్డులో నొప్పి కూడా హార్ట్ సమస్యలకు సంకేతం కావచ్చు. తల తిరగడం లేదా మూర్ఛపోవడం, గుండె త్వరగా, నెమ్మదిగా లేదా అస్థిరంగా కొట్టుకోవడం కాళ్ళు లేదా చేతుల్లో నొప్పి, తిమ్మిరి, బలహీనత లేదా చలి వంటి లక్షణాలు కూడా ఈ సమస్యలకు సంకేతం అవుతాయి.

న పేర్కొన్న ఏదైనా లక్షణాలు ఉంటే లేదా గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. గుండె సంబంధిత సమస్యలను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి అర్హత ఉన్న వైద్యులను మాత్రమే సంప్రదించాలి.