ఈ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ ఉన్నట్టే.. ఆ పరీక్ష చేయించుకోకపోతే మాత్రం ప్రాణాలకే రిస్క్!

ఈ మధ్య కాలంలో పురుషులు మహిళలు అనే తేడాల్లేకుండా ఎక్కువమంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. చాలామంది తమ వ్యాధి లక్షణాలు థైరాయిడ్ కు సంబంధించినవి అని కూడా తెలియకపోవడంతో వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. థైరాయిడ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. శరీరంలో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించే హార్మోన్లను రిలీజ్ చేయడంలో థైరాయిడ్ కీలక పాత్ర పోషిస్తుంది.

హైపో థైరాయిడిజం బారిన పడినా హైపర్ థైరాయిడిజం బారిన పడినా ఇబ్బందులు తప్పవు. అయితే వ్యాధి లక్షణాలను బట్టి ఉపయోగించే మందులలో మార్పులు ఉంటాయి. కొంతమంది థైరాయిడ్ మందులను జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మందులు వాడినా థైరాయిడ్ కంట్రోల్ లోకి రాకపోతే మాత్రం మోతాదు పెంచాల్సి ఉంటుంది. పొడి చర్మం సమస్యతో తరచూ బాధ పడుతున్నా అలసట, నీరసం వేధిస్తున్నాయా అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నా థైరాయిడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, జుట్టు రాలడం, మలబద్దకం, మతిమరపు సమస్యలు వేధిస్తున్నా థైరాయిడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ గ్రంథి ఎక్కువగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం బారిన, తక్కువగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం బారిన పడే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా థైరాయిడ్ వ్యాధి లక్షణాలను గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ వ్యాధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ప్రాణాలకే రిస్క్ కలుగుతుంది. అధికంగా చెమట పడుతున్నా నిద్రలేమి వేధిస్తున్నా చేతులు వణుకుతున్నా కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయా కూడా థైరాయిడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా వెంటనే అప్రమత్తం అయితే మంచిది. కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా థైరాయిడ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.