గోర్ల రంగు, ఆకారం, మచ్చలు వంటి మార్పులు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా పనిచేస్తాయి. గోర్లు పసుపు రంగులోకి మారడం, చిక్కగా కావడం, సులభంగా విరిగిపోవడం వంటివి కొన్ని సమస్యలకు సంకేతం అని చెప్పవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోతే గోర్లలో మార్పులు వస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే గోర్లు ప్రభావితం కావచ్చు. సోరియాసిస్, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు గోర్లపై మచ్చలు, రంగు మార్పులకు కారణం కావచ్చు.
ఊపిరితిత్తుల సమస్యలు కూడా గోర్ల రంగును మార్చడానికి కారణం కావచ్చు. గుండె వ్యాధులు కూడా గోర్లలో మార్పులను సూచించవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు గోర్లను మందంగా, రంగు మార్చడానికి మరియు సులభంగా విరిగిపోయేలా చేయవచ్చు. గోళ్ళను దుర్వినియోగం చేయడం వల్ల గోర్లు విరిగిపోయే అవకాశం ఉంటుంది. గోర్లలో ఏదైనా మార్పులు గమనిస్తే డాక్టర్ లేదా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది.
చాలామంది గోర్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. గోర్లలో ఏదైనా మార్పులు గమనిస్తే డాక్టర్ లేదా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది. గోళ్లు మన అందాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సంకేతాలను తెలియజేస్తాయి. గోళ్లు వంకర పోవడానికి క్లబ్బింగ్ నెయిల్స్ అంటారు. గోళ్లు షేప్‌లో ఈ మర్పులు కనిపిస్తే.. శరీరంలో హై కొలెస్ట్రాల్ సమస్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
గోర్లు నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత మోతాదులో ఆక్సిజన్ అందడం లేదని గుర్తించాలి. ఇలాంటి వారిలో గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. పరోనిచియా అనేది ఒక ఇన్ఫెక్షన్, ఇది గోరు మంచం అంచుల చుట్టూ రంగు మారడం మరియు వాపుకు కారణమవుతుంది. గోళ్ల పై వచ్చే సంకేతాలతో చాలా వ్యాధులకు సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయి.