ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకే పెరిగిపోతుంది. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ నేరాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత విషయాలను దొంగలించి సైబర్ నేరగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు వారి సమాచారానికి భద్రత కల్పించేలా ఐఫోన్ ఉపయోగించడం ప్రారంభించారు. ఐఫోన్ భద్రతకు పెట్టింది పేరు. అందువల్ల సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు వంటి వారు వారి వ్యక్తిగత సమాచారం సెక్యూరిటీ కోసం ఐఫోన్ ని ఉపయోగిస్తున్నారు. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యం.
అంతే ఈ ఐఫోన్ డిజైన్, ఫీచర్స్ వల్ల కూడా వీటిని ఉపయోగించటానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇదిలా ఉండగా ఐఫోన్ యూసర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటె ఇప్పుడు ఉన్న కొన్ని ఐఫోన్ వర్షన్ పై హ్యాకర్స్ ప్రభావం ఉంటోందని చెబుతున్నారు. కొన్ని వర్షన్స్ కలిగిన ఐఫోన్ల నుంచి హ్యాకర్స్ వారి వ్యక్తిగత సమాచారాన్ని మంగలించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా హెచ్చరిస్తున్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఐఓఎస్ లో హ్యాకింగ్ కు అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. కొన్ని రకాల ఐఫోన్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత, సున్నతమైన సమాచారం దొంగలించి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
సాధారణంగా ఐఫోన్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్స్, అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ అప్ డేట్ల కారణంగా మీ ఐఫోన్ సురక్షితంగా ఉంటుంది. కానీ, చాలా మంది ఈ అప్ డేట్స్ చేసుకోకుండా వదిలేస్తుంటారు. ముఖ్యంగా 16.3.1 వర్షన్, అంతకన్నా ముందు వర్షన్ ఐ ఫోన్లు, ఐపాడ్ ప్రో అన్ని మోడల్స్, థర్డ్ జనరేషన్ ఐపాడ్ ఎయిర్, దాని తర్వాత మోడల్స్, ఐపాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్, ఐఫోన్ 8, ఇలా కొన్ని మోడల్స్ పై హ్యాకర్స్ ప్రభావం ఉన్నట్లుగా కేంద్రం హెచ్చరిస్తోంది. అందువల్ల ఐఫోన్ వినియోగదారులు తప్పకుండా లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. అలాగే శాంసంగ్ గ్యాలెక్సీ వినియోగదారులను సైతం కేంద్రం హెచ్చరిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ లోనే హ్యాకింగ్ ఆస్కారాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. 4.5.49.8కి మునపటి వర్షన్స్ కలిగిన శాంసంగ్ గెలాక్సీ యాప్ స్టోర్ కలిగిన ఫోన్లపై హ్యాకింగ్ ప్రభావం ఉంటుందని తెలిపింది.